ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!!

ఈయ్యాల మీకో చిన్న కధ జెప్తా…!! అది నిజమో గాదో తేల్దు గాని ఇంటరెస్టింగ్ గా వుంటది…!! 

మా ముసల్ది నా సిన్నప్పుడు జెప్పింది…!! పొద్దున ఒక ఏడుపు గొట్టోడు ఎడుత్తా వుంటే….!! ఆన్ని జూసి నవ్వొచ్చి…!! ఆ నవ్వుతో పాటు..!! నా సిన్నపటి కధ గుర్తొచ్చింది…!! 

దుక్కం…!! అదెట్టా పుట్టిందంటే…!!

ఒక వూర్లో ఒక ముసలమ్మా ఉండేదట…!! ఎప్పుడు ఎడుత్తా వుండేది…!! అందుకే ఆ వూర్లో వొల్లంత ఆమెని దుక్ఖమ్మ అని పిలిచేటోల్లు…!! ముసల్దాని ఇంట్లో ఒక మావిడి చెట్టు వుండేది…!! అది 365 రోజులు చెట్టు నిండా మావిడి కాయలతో కళ కళ లాడి పోతా వుండేది..!! కాయలు జూసాకా…!! మనోళ్ళు ఊరుకుంటారా…!! ముసల్ది కొంపలో లేనప్పుడు…!! దోబ్బేసి తినేసేటోల్లు…!! అదొక సరదా…!! ముసల్దానికి మండి పోతా వుండేది..!! ఇంటికొచ్చినంకా ఏడుపు మాములే…!! 

అధట్టా గడిచి పోతా వుంటే…!! ముసల్దాని ఇంటి తలుపు ఎవడో దబ దబా కొట్టారు…!! ఎవుర్రా నా ఇంటి తలుపు ధట్టింది అని ముసలమ్మా తలుపు దీసి జూస్తే…!! మోకాల్లదాక గెడ్డం చంకలో కర్ర చేతిలో మర చెంబు పెట్టుకుని…!! ఎవరో పెద్దాయన…!! అమ్మా ఆకలి అయితా వుంది ఇంత అన్నం బెట్టు అని అడిగిండు…!! ముసల్ది మాములుగా పిసినారి ఎందుకో…!! పోన్లే అనిపించి కొంచెం అన్నం బెట్టింది…!! ఆ సన్యాసి థాంక్ యు వేరి మచ్…!! నీకో వరం ఇత్తా కోరుకో అని జెప్పాడు…!! ముసల్దాని మోహంలో 1000 కేండేళ్ళ బల్బు ఎలిగి…!! మరో ఆలోచన లేకుండా…!! సామి…!! నా మామిడి చెట్టుకి కాయలు రోజు ఎవరొకరు వొచ్చి కోసుకు పోతా వుండారు…!! నేను బయటకి వెళ్లి వచ్చేలోపల…!! చెయ్యి మీద చెయ్యి వేసిన అందరు అక్కడే..!! ఫెవి క్విక్ వేసి

ఆ విషయం తెలియని తిన్గార్నాయల్లు…!! షరా మాములుగా ముసల్ది లేనప్పుడు కాయలు కోస్కు బోధం అని చెట్టు మీద చెయ్యి వేసారు…!! అక్కడే అతుక్కు బోయారు…!! ముసల్ది రానే వచ్చింది..!! ముసల్దాన్ని జూసి కుయ్యో మొర్రో అని ఎడుత్తా…!! అమ్మ ఇంకెప్పుడు ఇటుపక్కకి రాము మమ్మల్ని వదిలెయ్యి తల్లి అని బ్రతిమి లాడేరు…!! ముసల్ది వార్నింగు ఇచ్చి వదిలేసింది.,..!! ఇట్టాగా ఎవరొకరు అతుక్కు బోవడం ముసలమ్మా వదిలించడం…!! జరిగి పోతా వుంది…!! 

ముసల్దానికి ఆ మంత్రం వుపయోగించడానికే…!! చిరాకు దొబ్బింది,,,,!!

ముసల్ది ఒక రోజు ఆవకాయ ఎస్కుని అన్నం దింటా వుంటే…!! ఎదురుగా ఒక యమ బటుడు వొచ్చి…!! ముసల్దానా నీ కాలం చెల్లి పోయింది…!! ఇంకా నువ్వు నాతో వచ్చేయి అని జెప్పడంతో ముసల్దానికి…!! అప్పుడే నేను చచ్చిపోతున్ననా అని బయం వేసింది…!! తరువాత బాధ యేసింది…!! వాకే అనుకుని…!! ఒక అవిడియా యేసింది..!! యమ బటా నేను అన్నం దింటున్న…!! తినినంకా నీతో వోత్తా…!! యీలోపల నువ్వు నా చెట్టు మామిడి కాయ స్పెషల్..!! కోస్కుని తింటుండు…!! నీకు మాజా తాగిన ఫీలు వోత్తది…!! నేను చెయ్యి గడుక్కు వొత్త అని…!! లోపాలకి వెళ్ళింది,….!! ఆ యమ బటుడు…!! ఒక కాయ రుచి చూద్దాం అని అట్టా చెయ్యి వెయ్యడం వాడు చెట్టుకి అతుక్కుపోవడం ఒక రీలులో అయిపోయినాయి…!!

చాటు నుంచి చూసిన ముసల్ది దూల తీరింది యధవకి అని మనస్సులో నవ్వుకుని వెళ్లి పోయింది…!!

అలాగా ఒక రోజు,రెండు రోజులు, మూడు రోజులు అయిన యమ బటుడు వెనక్కి రాలేదు…!! వెబ్ కెమ్ ఆన్ జేసి ఏం జరుగుతా వుంది అని జూస్తే,…!! అప్పుడు విషయం దేలిసింది…!! ఇంకా లాభం లేదని యముడే ముసల్దాన్ని దీస్కు బోధం అని వచ్చిండు…!! 

ముసల్ది యమున్ని జూసి రా నాయన రా…!! నీకు అన్నం బేడతా…!! నీ దున్న పోతుని ఆ మామిడి చెట్టుకి కట్టేసి ఇలా వచ్చి పీట మీద కాలు మీద కాలేస్కుని కూర్చో…!! అన్నం దినినంకా ఇద్దరం వెళ్లి పోదాం అని జెప్పక ముందే..!! ముసల్దానా…!! నీ తెలివి తెల్లారినట్టే వుంది…!! నన్ను గూడా బకార జేద్దాం అని జూడమాకా…!! ముందు నాతో బయల్దేరు అని అని జెప్పేడు..!!

ముసల్ది ఇంకా లాభం లేదు అనుకుని…!! యముడి దున్న పోతు మీద కూర్చుంది..!! నారాయణ నారాయణ అని అనుకుంటూ…!! అక్కడ నుంచి బయలు దేరుతున్డగానే…!!

యమా…!! నా పరిస్థితి ఏంది…!! నన్ను విడిపించు అని ఒక వాయిస్..!! అటు పక్కకి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే…!! యమ బటుడు…!! గబ్బిలం లా వేలాడతా వుండాడు…!! ముసల్దాన నువ్వేట్టాగు పోతా వుండవు..!! మా యమ బటున్ని ఇడిపించు..!! అస్సలే జీతాలు ఇయ్యడం లేదని చానా మంది సమ్మె జేస్తా వుండారు…!! వాణ్ణి వదిలెయ్యి అని ముసల్దాన్ని అడిగిండు…!!

ముసల్ది తెలివిగా నన్ను వదులు మీ వాన్నినేను విడిపిత్త అని బేరం బెట్టింది…!! 

యముడు దానికి…!! ముసలమ్మా బాగా చిక్కు ప్రశ్న బెట్టావు…!! నీకా వయస్సు అయిపోయింది…!! ఇక్కడ ఉన్న నీకు కష్టాలు దప్ప వేరే ఉపయోగం లేదు…!! సరే నువ్వు అడుగినావు గాబట్టి నీ పేరు లోఖం వున్నన్నాళ్ళు…!! ప్రతి మనిషి దగ్గర వినపడతానే వుంటది ఇది నీకు వరం అని జెప్పేడు…!! ముసలమ్మా సర్లే ఈ డీలు బానే వుందని యమ బటున్ని విడిపించింది,,,,!!

ఆ ముసలమ్మా పేరుతోనే ఈ తొక్కలో దుక్కలు మనకి…!! ఏం జేస్తాం…!! వాటిల్ని గూడ…!! నవ్వు అనే ముసుగు వేసి కప్పెత్తున్నం…!!

ఈ దుక్కాలు…!! మనకి ఎప్పుడు ఉండేయే గాని…!! అయ్యన్నిటిని సంచిలో బెట్టి మూట గట్టి మంచం కింద తోసేసి…!! నవ్వుతు వుండండి…!! ఆరోగ్యానికి మంచింది…!!

టేక్ కేర్…!!

Post navigation

Leave a Reply