ఒక చిన్న కథ | ప్రేమ & ఇష్టం

ఒక చిన్న కథ:
అనగనగా ఓ చెట్టు, ఆ చెట్టు పై ఓ చిలుకల జంట , ఒక చిలుక పేరు ప్రేమ(మగ), ఇంకో చిలుక పేరు ఇష్టం(ఆడ) ,
ప్రేమ అంటే ఇష్టంకి చాలా ఇష్టం ,కాని ప్రేమకు మాత్రం ఇష్టం అంటే చాలా ప్రేమ , అలా ఇష్టం ,ప్రేమా రెండూ
సంతోషంగా ఆ చెట్టు పై నివాసం ఉండేవి ,ఒకరోజు ఒక మనిషి ,ఇష్టంని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ,ఇది చూసిన ప్రేమ ,ఆ మనిషిని ఇష్టం ని వదిలేసి నన్ను తీసుకెళ్ళు అని అర్థిస్తుంది ,దానికి ఆ మనిషి సరే అని ‘ప్రేమ’ను బంధించి తీసుకెళతాడు,ఇష్టం ప్రేమ కోసం వెతకని చోటు లేదు , చివరికి వెతికి వెతికి ఇష్టం ప్రేమ లేని చోట తను ఉండలేనని ప్రాణాలు తీసుకుంటుంది, ప్రేమ కూడా ‘ఇష్టం’ కి దూరమైన క్షణం నుండి దిగులుతో కొన్నిరోజులకే తన తనువుని విడిచిపెడుతుంది..!

“ప్రేమలేని చోట ఇష్టం అశాశ్వతం ..! “

Post navigation

Leave a Reply