పాడేది పాడించేది ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నువ్వేలే అన్నీ నీ లీలలే
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!
కృష్ణా ముకుందా మురారీ
ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
———————————
ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమునది ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
—————————————-
పలికెను రాధిక మోహన మురళి
రవళించెను అందెల రవళి
మురళీలోలుని మోహన రాగం
రాధిక హృదిలో రసమయ గానం
రాగ రంజితం రాధిక హృదయం