పిట్ట సాయం – Telugu fun stories | Jokes

పిట్ట సాయం:-

రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది.
దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు.ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.
తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ ఫీలింగ్ తొలగిపోగా తాపీగా చేపలు పట్టేందుకు ఉపక్రమించాడు.
కాసేపాగాక ఎవరో వెనక పొడుస్తున్నట్లు అనిపించింది. వెనక్కి చూస్తే అదే పిట్ట….
ముక్కున మరో మూడు ఎరలతో!!!!

Post navigation

Leave a Reply