June 6, 2013
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!
పొద్దువాలిపోతుంటే..సూరిడుండిపోతాడా…!!
తెల్లారిపోతుంటే…సంద్రుడెల్లకుంటాడా….!!
రెప్పవాలిపోతుంటే…నిదురరాకుంటుందా..!!
నిదరోయె కనులుంటే…కలలురాకుంటాయ..!!
బాధపడకే సిలక…నీ భాద నాకెరుక..!!
రెక్కలొచ్చేదాక…రెప్పెనుక దాచేస్తా..!!
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!
నీ సామినై వస్తా…వచ్చి సెయ్యందుకుంట..!!
సద్దుమనిగేదాక సాయమై తోడుంట..!!
ఎల్లువెత్తె సెలయేరు…నేలనంటకుంటుంద..!!
నేలచేరినానీరు…నింగినంటకుంటుంద..!!
కన్నీటి ఈ కడలి కాటేసినా గాని…
నావనై నేనొస్తా…తీరమే చేరుస్తా..!!
హైలెస్సో హైలెసా..!! హైలెస్సో హైలెసా..!!