బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు.
నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తన్నుతాను.
బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా.
ఆఆఆఆఆఆఅ…………..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(ఇద్దరు వ్యక్తులు మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)
అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం,
విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
ఆఆఆఆఆఆ……………..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి “ఏమండీ మీ బందువొస్తోంది…పలకరించండి”
అంది నవ్వుతూ.
వరహాల రావు: “నమస్తే అత్త గారు…………..బాగున్నారా?” నేను మీ అమ్మాయి “Evening Walk” కి బయలుదేరామండి” అని పలకరించాడు వరహాల రావు.
ఆఆఆఆఅ….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(ఫోన్ రింగయ్యింది)
సుబ్బారావు: హలో!బాబు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు?
చింటు: మా నాన్న ఇంట్లో లేరండి.
సుబ్బారావు:సరే అమ్మకు ఇవ్వు.
చింటు: అమ్మ కూడా లేదండి.
సుబ్బారావు: ఇంకెవరూ లేరా?
చింటు: మా సిస్టర్ ఉంది.
సుబ్బారావు: అయితే ఆమెకివ్వు.
చింటు: ఉయ్యాలలోనుంచి తీస్తే ఏడుస్తుంది మరి………..ఇమ్మంటారా?