Whatsapp Forwarded Messages Telugu Golden Words

ఎవరు రాశారో తెలీదు, కానీ చాలా బాగుంది.
——————————————
👉మంత్రికి
తెలివుండాలి,

బంటుకి
భక్తుండాలి…

గుర్రానికి
వేగముండాలి

ఏనుగుకి
బలముండాలి…

సేనాధిపతికి
వ్యూహముండాలి,

సైనికుడికి
తెగింపుండాలి…

యుద్ధం నెగ్గాలంటే,
వీళ్ళందరి వెనుక
కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు…

కానీ మనమే,
రాజులా ఆలోచించడం
ఎప్పుడో ఆపేశాం!

👉”మన కసి –
అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
కొత్త దారులు కనుక్కోగలదు” అని మనకి తెలుసు.

అయినా,
భయానికి బానిసయ్యాం.
ఓటమికి తలొంచేసాం !

👉చరిత్రలో,
చాలా మంది రాజులు…

🌺ఓడిపోయారు,
🌺 పారిపోయారు,
🌺 దాక్కున్నారు,
🌺 దాసోహమయ్యారు.

కానీ కొందరే,
అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి
యుద్ధం చేశారు.

‘రాజంటే స్థానం కాదు,
రాజంటే స్థాయి’ అని
నిరూపించారు.

👉డబ్బొచ్చినా పోయినా
వ్యక్తిత్వం కోల్పోకు…

రాజ్యాలున్నా చేజారినా
రాజసం కోల్పోకు…

👉రాజంటే
కిరీటం ,కోట ,పరివారం కాదు,

రాజంటే
ధైర్యం…

రాజంటే
ధర్మం…

రాజంటే
యుద్ధం…!

👉ఒకరోజు
విందుభోజనం చేస్తావు,

ఇంకోరోజు
అడుక్కుతింటావు
– పాండవుల్లా…!

👉ఒక రాత్రి
బంగారు దుప్పటి
కప్పుకుంటావు,

మరో రాత్రి
చలికి వణికిపోతావు
– శ్రీరాముడిలా…!

👉ఎత్తు నుండి నేర్చుకో,
లోతు నుండి నేర్చుకో…

రెండింటి నుండి
ఎంతో కొంత తీసుకో…!

👉రాజంటే
స్టానం కాదు
రాజంటే
స్థాయి…

👉స్థానం – భౌతికం,
కళ్ళకు కనపడుతుంది.
స్థాయి – మానసికం,
మనసుకు తెలుస్తుంది…!

మనందరిలో
ఒక రాజుంటాడు…

బ్రతికిస్తావో,
చంపేసుకుంటావో నీ ఇష్టం!
👌Golden words👌

Whatsapp Forwarded Messages Telugu Golden Words, Whatsapp status messages and SMS in Telugu Language.

Post navigation